Home > జాతీయం > మానవత్వానికే సిగ్గుచేటు.. మధ్యప్రదేశ్ ఘటనపై రాహుల్ ఫైర్

మానవత్వానికే సిగ్గుచేటు.. మధ్యప్రదేశ్ ఘటనపై రాహుల్ ఫైర్

మానవత్వానికే సిగ్గుచేటు.. మధ్యప్రదేశ్ ఘటనపై రాహుల్ ఫైర్
X

మధ్యప్రదేశ్ లో జరిగిన అమానవీయ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు.ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత చేసిన అమానుష పనికి యావత్ దేశం సిగ్గుతో తలదించుకుంటోందన్నారు. బీజేపీ పాలనలో గిరిజన సోదర, సోదరీమణులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఆదివాసీలు, దళితులపై బీజేపీకి ఉన్న ద్వేషానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ఈ చర్యతో బీజేపీ అసలు ముఖం బయటపడిందని ఫైర్ అయ్యారు.

కాగా మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఓ గిరిజనుడిపై ఓ వ్యక్తి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. గిరిజనుడు ఓ షాపు మెట్లపై కూర్చోని ఉండగా.. ఓ వ్యక్తి అతడి ముఖంపై మూత్రం పోశాడు. మరో వ్యక్తి సిగ్గులేకుండా ఈ వీడియె తీశాడు. ఈ దారుణం మూడు నెలల క్రితం జరగ్గా.. ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్గా మారింది. మూత్రం పోసిన వ్యక్తి ప్రవేష్ శుక్లాగా గుర్తించారు. అతడు బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా అనుచరుడని సమాచారం.

ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుక్కలు కూడా ఈ పనిచేయవంటూ నటి కస్తూరి విరుచుకుపడింది. ఈ నిందితుడికి శిక్ష వేస్తారా? లేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన ట్వీట్‌లో ‘కుక్కలు కూడా ఇలా చేయవు. ఈ ప్రవేశ్ శుక్లా బీజేపీ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లాకు సన్నిహితుడని తెలుస్తోంది. అతన్ని తక్షణమే శిక్షిస్తారా లేదా ఈ విషయాన్ని వదిలేస్తారా? అని నిలదీసింది. కాగా నిందితుడని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Updated : 5 July 2023 8:52 PM IST
Tags:    
Next Story
Share it
Top