సోనియా గాంధీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ
X
రాహుల్ గాంధీ సమయం ఉన్నప్పుడల్లా తన తల్లి సోనియా గాంధీతో సరదాగా గడుపుతుంటాడు. తన ప్రేమను పంచుతుంటాడు. తాజాగా రాహుల్.. సోనియాకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. గోవా టూర్ వెళ్లిన రాహుల్ వస్తూ వస్తూ.. సోనియాకు గిఫ్ట్ తీసుకొచ్చాడు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను సోనియా గాంధీ కోసం తీసుకొచ్చాడు. రాహుల్ తెచ్చిన బహుమతికి ఎంతో సంతోషించిన సోనియా.. ఆ కుక్క పిల్లను ప్రేమతో చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది. దానికి నూరీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కుక్క పిల్లను చూసిన సోనియా మురిసిపోతూ.. ప్రేమతో గుండెలకు హత్తుకుంది. గోవా పర్యటించిన రాహుల్.. ఆ టైంలో డాగ్ ఫామ్ నడుపుతున్న దంపతులను కలిశారు. అక్కడ ఈ కుక్కపిల్ల బాగా నచ్చడంతో.. రాహుల్ కొనుగోలు చేశారు.
Rahul Gandhi brought home a Jack Russell terrier puppy after his visit to Goa.
— Team Congress (@TeamCongressINC) October 4, 2023
Presented to Sonia Gandhi.#RahulGandhi #SoniaGandhi pic.twitter.com/cOTu8zcQNc