జోడో యాత్రకు సడన్ బ్రేక్.. ఢిల్లీకి రాహుల్ గాంధీ.. ఇంతకీ ఏం జరిగింది?
X
నిన్న మమతా బెనర్జీ.. నేడు నితీశ్ కుమార్.. ఇలా ఇండియా కూటమికి రోజుకొకరు దూరమవుతూ కాంగ్రెస్ కు షాకిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తేల్చిచెప్పేస్తున్నారు. ఎన్నికల్లో మమతా బెనర్జీ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. నితీశ్ కుమార్ బీజేపీతో కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో రాజకీయాలు రోజురోజులు మారిపోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు బ్రేక్ పడింది. రెండు రోజుల పాటు యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా యాత్ర గురువారం ఉదయం అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఇక్కడ రోడ్ షో నిర్వహించిన అనంతరం రాహుల్.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల తర్వాత జనవరి 28న యాత్రను తిరిగి ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరు వైదొలుగుతుండటంతో వారిని శాంతింపజేసేందుకు రాహుల్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.
Bharat Jodo Nyay Yatra, Rahul Gandhi yatra,mamata banerjee,trinamool congress party, west bengal,Bihar,nithish kumar,INDIA alliance,Congress Yatra Two Day Break,Break to Bharat Jodo Nyay Yatra,rahul Gandhi went to delhi