Home > జాతీయం > Rahul Gandhi: WFI ఎన్నికల వివాదం.. రెజ్లర్లను కలిసిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: WFI ఎన్నికల వివాదం.. రెజ్లర్లను కలిసిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: WFI ఎన్నికల వివాదం.. రెజ్లర్లను కలిసిన రాహుల్‌ గాంధీ
X

బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషన్ సన్నిహితుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ పలువురు రెజ్లర్లు అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారిని కలిశారు. హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఛరా గ్రామంలో వీరేంద్ర ఆర్య అఖారాకు వెళ్లిన ఆయన రెజ్లర్లతో మాట్లాడారు. కొద్ది సేపు వారితో ముచ్చటించారు. క్రీడాకారులపై లైంగిక వేధింపులు, తర్వాత ఎన్నికల వ్యవహారానికి సంబంధించిన విషయాలను క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారని, ఆయనతో సమావేశమైన ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్‌ పునియా (Bajrang Poonia) తెలిపారు.

అయితే ఈ సమావేశం అనంతరం పునియా మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ ఒక రెజ్లర్ కాబట్టి రోజువారీ మా కార్యకలాపాలను చూడటానికి వచ్చారు. మాతో పాటు రెజ్లింగ్ కూడా చేశారు’ అని తెలిపారు. 'మేము రెజ్లింగ్‌ ప్రాక్టిస్‌ చేస్తున్న క్రమంలో అకస్మత్తుగా మా వద్దకు ఆయన చేరుకున్నారు. ఆయన ఉదయమే 6.15 గంటలకు ఇక్కడికి వచ్చారు. మాతో పాటు కాసేపు వ్యాయామం​ చేశారు. ఆయనకు క్రీడల పట్ల ఉన్న అనుభవాలను మాతో పంచుకున్నారు. రాహుల్‌ గాంధీకి క్రీడాల పట్ల చాలా పరిజ్ఞానం ఉంది’ అని రెజ్లింగ్‌ కోచ్‌ వీరేంద్ర ఆర్య పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

రాహుల్ గాంధీ తమ రోజువారీ కార్యకలాపాలను చూడటానికి మాత్రమే వచ్చారని, ఆయన కూడా సరదాగా మల్లయోధులతో తలపడ్డారని రెజ్లర్లు చెప్పారు. మరోవైపు సంజయ్‌సింగ్‌ WFI అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ తన ఖేల్‌రత్న అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ నిర్ణయించుకుంది. ఇప్పటికే సాక్షి మలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా, బజ్‌రంగ్‌ పునియా, వీరేందర్‌ యాదవ్‌ పద్మశ్రీ అవార్డులను త్యజించారు.

Updated : 27 Dec 2023 7:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top