Home > జాతీయం > Rahul Gandhi Meet Kalpana Soren : కల్పనా సోరెన్‌తో రాహుల్ భేటీ

Rahul Gandhi Meet Kalpana Soren : కల్పనా సోరెన్‌తో రాహుల్ భేటీ

Rahul Gandhi Meet Kalpana Soren : కల్పనా సోరెన్‌తో రాహుల్ భేటీ
X

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. సోమవారం రాహుల్ పర్యటన ప్రారంభానికి ముందు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.. రాహుల్‌తో భేటీ అయింది. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. సోమవారం రాహుల్ పర్యటన ప్రారంభానికి ముందు జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్‌ను కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విధానంపై ఇరువురు చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ వీరిద్దరి భేటీ గురించి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. రాంచీలోని హెచ్‌ఈసీ కాంప్లెక్స్‌లోని చారిత్రాత్మక షాహీద్ మైదాన్‌లో బహిరంగ సభకు కొన్ని నిమిషాల ముందు, జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన తర్వాత కల్పనా సోరెన్‌ను రాహుల్‌ గాంధీ కలిసినట్లు చెప్పారు. వారిద్దరూ కలిసిన ఫొటోను ఎక్స్ లో పోస్ట్‌ చేశారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో చంపయ్ సోరెన్‌ ప్రభుత్వానికి బలపరీక్ష జరిగింది. ఈ పరీక్షలో చంపయ్ విజయం సాధించారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి చెందిన 47 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. వ్యతిరేకంగా 27 ఓట్లు పడ్డాయి. దీంతో చంపయ్ సోరెన్ ప్రభుత్వం సునాయాసంగా నెగ్గింది. అవినీతి ఆరోపణలతో ఈడీ అరెస్ట్ చేసిన హేమంత్‌ సోరెన్‌ కూడా కోర్టు అనుమతితో సోమవారం జరిగిన బలపరీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన తన అరెస్ట్‌కు బీజేపీ కారణమని విమర్శించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను రుజువు చేయాలని బీజేపీని సవాల్‌ చేశారు. అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని అన్నారు.




Updated : 5 Feb 2024 7:02 PM IST
Tags:    
Next Story
Share it
Top