Home > జాతీయం > పార్లమెంట్పై దాడికి కారణం అదే.. రాహుల్ గాంధీ

పార్లమెంట్పై దాడికి కారణం అదే.. రాహుల్ గాంధీ

పార్లమెంట్పై దాడికి కారణం అదే.. రాహుల్ గాంధీ
X

ఇటీవల కొందరు దుండగులు పార్లమెంట్ లోకి ప్రవేశించి స్మోక్ బాంబులతో భీభత్స సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే పార్లమెంట్ పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పార్లమెంట్ పై దాడికి నిరుద్యగమే ప్రధాన కారణమని అన్నారు. ఉద్యోగాలు లేకే నిరుద్యోగులు తమ నిరసన తెలపడానికి పార్లమెంట్ లోకి చొరబడ్డారని అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని అన్నారు.

కాగా ఈ నెల 13న మధ్యాహ్నం లోక్ సభలో జీరో అవర్ జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీలో నుంచి ఇద్దరు ఆగంతకులు లోపలికి దూసుకొచ్చారు.

ఎంపీల సీట్ల నుంచి జంప్ చేస్తూ కలర్ స్మోక్ ను వదిలారు. దీంతో ఎంపీలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక బయటకు పరుగులు తీశారు. ఇక కొంతమంది ఎంపీలు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సరిగ్గా 22 ఏళ్ల కందట అదే రోజున ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి చేశారు. ఈ దాడిలో 9మంది అమరులయ్యారు. ఈ క్రమంలోనే ఈ నెల 13 నాటి దాడికి 2001 డిసెంబర్ 13నాటి దాడితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ దాడికి ప్రధాన కారకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated : 16 Dec 2023 3:15 PM IST
Tags:    
Next Story
Share it
Top