Home > జాతీయం > Rahul Gandhi : జార్ఖండ్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ..పిటిషన్ తిరస్కరణ

Rahul Gandhi : జార్ఖండ్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ..పిటిషన్ తిరస్కరణ

Rahul Gandhi  : జార్ఖండ్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ..పిటిషన్ తిరస్కరణ
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టి వేయాలని రాహుల్ పెట్టుకున్న అప్పీల్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడని రాహుల్ ఎన్నికల ప్రచారంలో ఆరొపించారు. దీంతో రాహుల్‌పై క్రిమినల్ కేసు నమోదు అయింది. తొలుత లోయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును జార్ఖండ్ హైకోర్టుకు బదిలీ చేశారు. ట్ర‌య‌ల్ కోర్టులో ఆ కేసు విచార‌ణ జ‌రుగుతున్న‌ది. జ‌స్టిస్ అంబుజ‌నాథ్ ఈకేసును విచారించారు. రాహుల్ గాంధీ త‌ర‌పున అడ్వ‌కేట్ పీయూష్ చిత్రేశ్‌, దీపాంక‌ర్ రాయ్‌లు వాదించారు. ఫిబ్ర‌వ‌రి 16వ తేదీన రాహుల్ గాంధీ రాసిన లేఖ‌ను కోర్టులో స‌మ‌ర్పించారు. అయితే జ‌స్టిస్ అంబుజ‌నాథ్‌కు చెందిన బెంచ్ త‌న నిర్ణ‌యాన్ని రిజ‌ర్వ్ చేసింది.

జార్ఖండ్ హైకోర్టులో బీజేపీ నేత న‌వీజ్ ఝా ఆ కేసును ఫైల్ చేశారు. బీజేపీ నేత అమిత్ షాపై రాహుల్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆ పిటీష‌న్‌లో ఆరోపించారు. తొలుత లోయ‌ర్ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఆ త‌ర్వాత ఆ మ్యాట‌ర్‌ను జార్ఖండ్ హైకోర్టుకు త‌ర‌లించారు. 2018లో కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షాపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలను నమ్ముతుందని చెప్పుకుంటున్నదని, అయితే, హత్య కేసులో నిందితుడు గా ఉన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడు అంటూ రాహుల్ ఆరోపించారు. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలు అమిత్ షా ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ అదే ఏడాది ఆగస్టు 4న కోర్టును విజయ్ మిశ్రా ఆశ్రయించాడు. దీంతో ఇవాళ ట్రయల్ కోర్టు ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అమిత్ షాకు పరువు నష్టం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.




Updated : 23 Feb 2024 3:09 PM IST
Tags:    
Next Story
Share it
Top