Home > జాతీయం > Bharat Nyay Yatra:'భారత్ న్యాయయాత్ర' పేరుతో రాహుల్ గాంధీ మరో యాత్ర

Bharat Nyay Yatra:'భారత్ న్యాయయాత్ర' పేరుతో రాహుల్ గాంధీ మరో యాత్ర

Bharat Nyay Yatra:భారత్ న్యాయయాత్ర పేరుతో రాహుల్ గాంధీ మరో యాత్ర
X

భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. దీనికి ‘భారత్ న్యాయ యాత్ర’గా నామకరణం చేశారు. ఈ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు కొనసాగనుంది. వచ్చే నెల జనవరి 14వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు రాహుల్ గాంధీ యాత్ర చేయనున్నారు. మొత్తం 6,200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. ఈశాన్య భారత్ నుంచి పశ్రిమ తీరం వరకు మొత్తం 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా యాత్ర కొనసాగనుంది. బస్సు, కాలినడకన సాగనున్న ఈ యాత్ర మార్చి 20 న ముగియనుంది

మొత్తం 14 రాష్ట్రాలు.. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలల్లోని 85 జిల్లాల పరిధిలో 6200 కి.మీ.ల దూరం ఈ యాత్ర సాగుతుందని AICC ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఈ యాత్ర ద్వారా ఎలాంటి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ లేదని వివరించారు. ప్రజలు పడుతున్న సమస్యలను తెలుకోడానికే ఈ యాత్ర చేస్తున్నామని వెల్లడించారు. భారత్ న్యాయ యాత్రను పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రారంభించనున్నారు

Updated : 27 Dec 2023 11:15 AM IST
Tags:    
Next Story
Share it
Top