Home > జాతీయం > గురువారం మణిపూర్కు రాహుల్ గాంధీ

గురువారం మణిపూర్కు రాహుల్ గాంధీ

గురువారం మణిపూర్కు రాహుల్ గాంధీ
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లనున్నారు. హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న ఆ ఈశాన్య రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ సందర్భంగా రాహుల్ బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.

జూన్‌ 29, 30 తేదీల్లో రాహుల్‌ గాంధీ మణిపూర్‌లోని హింసాత్మక ఘటనల్లో బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. రాహుల్ ఇంఫాల్‌, చురచంద్‌పుర్‌లలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను సందర్శించి అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడనున్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ జాతుల మధ్య వైరంతో దాదాపు రెండు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. మణిపుర్‌లో శాంతి స్థాపన దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని వేణుగోపాల్ గుర్తు చేశారు. ఇదో మానవతా విషాదమన్న ఆయన అక్కడి పరిస్థితులపై ద్వేషంతో కాకుండా ప్రేమగా వ్యవహరించడం బాధ్యత అని ట్వీట్‌ చేశారు.

మైటీలకు ఎస్టీ హోదా కల్పించడంపై మే 3న మొదలైన అల్లర్లు ఆ తర్వాత హింసాత్మకంగా మారాయి. అప్పటి నుంచి జరిగిన ఘటనల్లో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర జనాభాలో 53శాతంగా ఉన్న మైటీలకు ఎస్టీ హోదా కల్పించడంపై నాగాలు, కుకీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 27 Jun 2023 10:25 PM IST
Tags:    
Next Story
Share it
Top