Bharat Jodo Nyay Yatra : రాహుల్ జోడో యాత్రకు .. సారథిగా మారిన ఆర్జేడీ నాయకుడు!!
X
బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) డ్రైవర్ అవతారమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ బిహార్(Bihar)లో ముగియనుంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ శుక్రవారం ససారంలో రాహుల్ గాంధీతో కలిసి న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. ససారం నుంచి శుక్రవారం యాత్ర ప్రారంభం కాగా.. తేజస్వీ స్వయంగా జీపు నడుపుతూ రాహుల్‌తో ముచ్చటించారు. ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం జీపులో వెనక ఉన్నారు. ఈ పోటోలను తేజస్వీ ఎక్స్ లో పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కైమూర్‌లోని దుర్గావతి బ్లాక్‌లోని ధనేచా వద్ద కైమూర్‌లో జరిగే బహిరంగ సభలో ఇద్దరూ పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
ఇండియా కూటమి నుంచి నితీశ్ కుమార్ వైదొలిగిన తర్వాత రాహుల్, తేజస్వి భేటీ కావడం ఇదే తొలిసారి.
అనంతరం యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. యాత్ర యూపీలోకి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ యాత్రలో పాల్గొననున్నారు.