మెకానిక్గా మారిన రాహుల్ గాంధీ..ఫొటోలు వైరల్
X
కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మెకానిగ్గా మారారు. బైక్ రిపేర్ షాపుకు వెళ్లి మెకానిక్‌ల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్గా మారాయి. కరోల్ బాగ్ మార్కెట్‌లోని బైక్ రిపేర్ షాప్కు వెళ్లి.. ఆయన అక్కడి పనివాళ్లతో ముచ్చటించారు. వాళ్లతో కలిసి బైక్ రిపేర్ చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనిలో పనిగా తానూ ఓ స్క్రూడ్రైవర్‌ను అందుకుని ఓ బైక్ నట్లను బిగించారు. బైక్ ఇంజిన్ పనితీరు గురించీ రాహుల గాంధీ.. అక్కడి వర్కర్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పక్కనే ఓ లేథ్ మెషిన్ షాప్‌లోకి వెళ్లారు. అక్కడ తయారయ్యే పరికరాలపై ఆరా తీశారు. దాదాపు రెండు గంటల సేపు ఆయన అక్కడ ఉన్నారు. రాహుల్ రావడంతో స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను రాహుల్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దానికి ‘‘ రెంచ్లను తిప్పుతూ.. భారత రథచక్రాలను ముందుకు తీసుకెళ్తున్న వారి నుంచి నేర్చుకోవడం’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్గా మారాయి.
రాహుల్ నేరుగా పలు వర్గాల ప్రజల దగ్గరికి వెళ్లి.. వాళ్ల సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవలె రాహుల్ అమెరికాలో ఓ ట్రక్లో ప్రయాణించి.. ట్రక్ డ్రైవర్ల సమస్యలను తెలుసుకున్నారు. అంతకుముందు హరియాణాలోని అంబాలా నుంచి చంఢీగఢ్ వరకు లారీలో ప్రయాణించి లారీ డ్రైవర్ల సమస్యలను తెలుసుకున్నారు.