Rahul Gandhi : పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ ఎక్కడినుంచంటే..?
X
మరో రెండు, మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే తాజాగా అందులో చీలికలు ఏర్పడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర చేస్తున్నారు. ఈ నెల 14న ప్రారంభమైన ఈ యాత్ర మార్చి 20వరకు కొనసాగనుంది. అయితే రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం రాహుల్ వయనాడ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో అమేథి సహా వయనాడ్ నుంచి ఆయన పోటీ చేశారు. అయితే అమేథిలో కేంద్రమంత్రి సృతి ఇరానీ గెలిపొందారు. వయనాడ్ నుంచి రాహుల్ భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై కాంగ్రెస్ ఎంపీ మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మరోసారి వయనాడ్ నుంచే పోటీ చేస్తారని చెప్పారు. కన్నూర్ మినహా కేరళలోని మిగితా స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు మరోసారి బరిలోగి దిగుతారని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ లో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.