Home > జాతీయం > మణిపూర్లో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ కాన్వాయ్ని అడ్డుకున్న పోలీసులు

మణిపూర్లో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ కాన్వాయ్ని అడ్డుకున్న పోలీసులు

మణిపూర్లో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ కాన్వాయ్ని అడ్డుకున్న పోలీసులు
X

హింసాత్మక ఘటనలతో రగిలిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో.. రెండు రోజుల పర్యటనకు వెళ్లారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో గురువారం అక్కడికి చేరుకున్న రాహుల్ కు ఊహించని పరిణామం ఎదురైంది. పర్యటన మొదలు కాకముందే.. రాహుల్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఘర్షనలకు కేంద్ర బిందువుగా చెప్పుకునే చురాచంద్ పూర్ జిల్లా వైపు వెళ్తున్న రాహుల్ కాన్వాయ్ ని.. బిష్ణుపుర్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.





మార్గ మధ్యలోనే కాన్వాయ్ ని నిలిపివేశారు. దాంతో రాహుల్ కాన్వాయ్ తిరిగి ఇంఫాల్ కు బయలుదేరింది. అనుమతి లేదని చెబుతున్నా.. ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి రాహుల్ గాంధీకి అభివాదం తెలిపారు. పోలీసుల చర్యపై మండిపడుతూ నినాదాలు చేశారు. అయితే, మైతేయ్ లకు ఎస్టీ హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కుకీలు మే 3న నిర్వహించిన గిరిజన సంఘీభావ ర్యాలీ లో తీవ్ర ఘర్షనలు జరిగాయి. అప్పటి నుంచి అక్కడ హింసాత్మత ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనల వల్ల 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 శిబిరాల్లో 50వేల మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.





Updated : 29 Jun 2023 3:43 PM IST
Tags:    
Next Story
Share it
Top