Home > జాతీయం > రామేశ్వర్ తో కలిసి డిన్నర్ చేసిన రాహుల్ గాంధీ

రామేశ్వర్ తో కలిసి డిన్నర్ చేసిన రాహుల్ గాంధీ

రామేశ్వర్ తో కలిసి డిన్నర్ చేసిన రాహుల్ గాంధీ
X

సినిమా, క్రికెటర్లకే కాదు రాజకీయనాయకులకూ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళను కలవాలని అడుగుతూ ఉంటారు కూడా. అలా రాహుల్ గాంధీని కలవాలని ఉందని అడిగిన ఒక కూరగాయలు అమ్మే వ్యక్తిని కలవడమే కాదు, తనతో కలిసి భోజనం కూడా చేశాడరు కాంగ్రెస్ అధినేత. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.





ఆజాద్ పూర్ మండి కూరగాయల విక్రేత రామేశ్వర్ ను కలిశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయనతో కలిసి భోజనం కూడా చేశారు. కొన్ని రోజుల క్రితం ఈ రామేశ్వర్ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఇతను ఓ సాధారణ కూరగాయలు అమ్మే వ్యక్తి. టమాటాల ధర బాగా పెరిగినప్పుడు...ఆయన పెద్ద మొత్తంలో అవి కొడానికి మండి రావడం, అయితే ధర ఎక్కువగా ఉన్నందున కొనలేకపోవడం, అప్పుడు రామేశ్వర్ ఏడవడాన్ని వీడియో తీశారు. దాంతో అతను అందరికీ తెలిసాడు. న్యూస్ లో వ్యక్తి అయ్యాడు. అప్పుడే అదే వీడియోలో రామేశ్వర్ రాహుల్ గాంధీని కలవాలని ఉందని చెప్పారు. ఇప్పుడు ఆకోరికనే రాహుల్ తీర్చేశారు.

మొదట రాహుల్ గాంధీనే రామేశ్వర్ ను కలవడానికి ఆజాద్ పూర్ మండి వెళ్ళారు. అక్కడ కూరగాయల విక్రేతలందరినీ కలిశారు. వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అయితే ఆరోజు రామేశ్వర్ మండికి రాలేదు. దాంతో అతను రాహుల్ను కలవడం మిస్ అయ్యారు. అందుకే ఈరోజు రాహుల్ అతనిని స్వయంగా ఇంటికి పిలిపించుకుని, భోజనం పెట్టి మరీ పంపించారు. రామేశ్వర్ తో పాటూ రాహుల్ కూడా డిన్నర్ చేశారు.

రామేశ్వర్ ను కలిసిన ఫోటోలను, వీడియోలను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పెట్టారు. రామేశ్వర్ ఒక సజీవమైన వ్యక్తి అని అన్నారు రాహుల్. భారతీయులకు సహజంగా ఉండే ఒక రకమైన పరిణితి అతనిలో తనకు కనిపించిదని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నవ్వుతూ ముందుకు సాగిపోయేవారే భారత భాగ్య విధాతలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. రామేశ్వర్ మొదటి వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం సమస్యపై ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ఈ వీడియో అప్పట్లో షేర్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కూడా లోక్ సభలో రామేశ్వర్ గురించి ప్రస్తావించారు.

Updated : 14 Aug 2023 9:43 PM IST
Tags:    
Next Story
Share it
Top