Home > జాతీయం > 35 పైసలకే రూ. 10 లక్షల రైల్వే బీమా.. మిస్ కావొద్దు

35 పైసలకే రూ. 10 లక్షల రైల్వే బీమా.. మిస్ కావొద్దు

రైల్వే శాఖ సదుపాయం

35 పైసలకే రూ. 10 లక్షల రైల్వే బీమా.. మిస్ కావొద్దు
X

మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబం రోడ్డున పడకుండా బీమా తీసుకుంటూ ఉంటాం. ఒడిశా బాలాసోర్‌లోని జరిగిన ఘోర రైలు ప్రమాదాల్లాంటివి సంభవించినప్పుడు బీమా ఉంటే బావుండేది కదా అనుకుంటాం. ఎల్ఐసీ వంటి కంపెనీలే కాదు చాలా సంస్థలు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. రైల్వే శాఖ కూడా నామమాత్రపు ఫీజుతో రైలు ప్రయాణ భీమా కల్పిస్తోంది. దీని కోసం కేవలం 35 పైసలు చెల్లిస్తే చాలు. ప్రమాదంలో మరణిస్తే రూ. 10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ. 7.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ 19 వేలు చెల్లిస్తుంది. మృతదేహాన్ని స్వస్థలానిక తీసుకెళ్లేందుకు రూ. 10 వేలు చెల్లిస్తుంది. వస్తువులు పోగొట్టుకున్నా బీమా వర్తిస్తుంది.

ఎలా చేసుకోవాలి?

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి 35 పైసలు చెల్లించాలి. మన ఫోనుకు, ఈమెయిల్‌కు లింకు వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి నామినీ వివరాలు అందించాలి. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల్లోపు బీమాను క్లెయిమ్ చేసుకోవాలి. నామినీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. లేకపోతే బీమా సొమ్ము ఇవ్వరు.


Updated : 4 Jun 2023 8:16 AM IST
Tags:    
Next Story
Share it
Top