Mathura Rail Accident: మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే.. వీడియో వైరల్..
X
యూపీలోని మధుర రైల్వే స్టేషన్లో బుధవారం జరిగిన రైలు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైలు ఇంజిన్లోని సీసీ టీవీ పుటేజీలో ప్రమాదంపై ఓ క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైలు ప్రమాదానికి ముందు లోకోపైలట్ షిఫ్ట్ ఛేంజ్ అయ్యారు. అప్పుడే ఇంజిన్ లోకి వచ్చిన ఉద్యోగి వీడియో కాల్ మాట్లాడుతూ.. బ్యాగును ఇంజిన్ థొరెటల్పై పెట్టాడు. దీంతో రైలు ముందుకు కదిలినట్లు తెలుస్తోంది.
ఇంజిన్లో ఉన్న ఉద్యోగిని సచిన్గా గుర్తించిన అధికారులు.. ప్రమాదసమయంలో అతడు మద్యం తాగివున్నట్లు అనుమానిస్తున్నారు. వెంటనే అతడిని మెడికల్ టెస్టు కోసం పంపారు. రిపోర్ట్స్ ఆధారంగా అతడిపై చర్యలు తీసుకోనున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగుర్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
కాగా బుధవారం స్టేషన్లో ఆగివున్న రైలు ప్లాట్‌ఫాంపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అయితే మధ్యలో ఉన్న పిల్లర్‌ను ఢీకొని అక్కడే నిలిచిపోయింది. పిల్లర్ అడ్డుగా లేకపోతే ప్రయాణికులపైకి దూసుకెళ్లేది.
मथुरा ट्रेन हादसे का CCTV
— PRIYA RANA (@priyarana3101) September 28, 2023
रेलवे कर्मचारी वीडियो कॉल पर था,
नशे में थ्रोटल पर रखा बैग
ट्रेन प्लेटफॉर्म तोड़ते हुए ऊपर चढ़ी #Mathura #train #CCTV pic.twitter.com/beyDj87WeH