Home > జాతీయం > రైలు ప్రమాద కారణాలను ఇప్పుడే చెప్పలేం : రైల్వే మంత్రి

రైలు ప్రమాద కారణాలను ఇప్పుడే చెప్పలేం : రైల్వే మంత్రి

రైలు ప్రమాద కారణాలను ఇప్పుడే చెప్పలేం : రైల్వే మంత్రి
X

ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రస్తుతం సహాయక చర్యలపైనే పూర్తి దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాద కారణాలు తెలుస్తాయని అన్నారు. ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద స్థలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ రైలు ప్రమాదంపై కారణాలను ఇప్పటికిప్పుడే చెప్పలేమని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ‘‘ప్రమాద ఘటనపై దర్యాప్తుకు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక వచ్చాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. ప్రస్తుతం సహాయకచర్యలపై పూర్తిగా దృష్టి సారించాం. ఘటనాస్థలిలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ప్రమాదంలో 280పైగా మృతిచెందగా.. 1000మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోడీ, సీఎం నవీన్ పట్నాయక్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి..ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లను పరామార్శించారు.

Updated : 3 Jun 2023 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top