Home > జాతీయం > మే 1 నుంచి రైళ్ల సర్వీసులన్నీ నిలిపేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక

మే 1 నుంచి రైళ్ల సర్వీసులన్నీ నిలిపేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక

మే 1 నుంచి రైళ్ల సర్వీసులన్నీ నిలిపేస్తాం..  రైల్వే సంఘాల హెచ్చరిక
X

రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపేస్తామని హెచ్చరించారు. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలనే తమ డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడంలేదని.. దానివల్ల ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని JFROPS (జాయింట్‌ ఫోరం ఫర్‌ రెస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌) కన్వీనర్‌ శివ్‌ గోపాల్‌ మిశ్రా అన్నారు. ఈ సందర్భంగా JFROPS సంయుక్త వేదికగా.. పలు రైల్వే సంఘాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు ఏకతాటిపైకి వచ్చారు.Railway unions will stop all railway services from May 1 if their demands are not met

ఈ యూనియన్ తరఫున వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధుల బృందం మార్చి 19న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలవనున్నారు. ఈ మేరకు సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు కన్వీనర్‌ వివరించారు. ఇతర ప్రభుత్వ సంఘాలు కూడా వీరి పోరాటంలో భాగం అవుతున్నట్లు ఓ ప్రకటనలో ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కొత్త పింఛను విధానం ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదన్నారు.

Updated : 1 March 2024 6:44 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top