President Murmu Native Place: ఎట్టకేలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలానికి ప్యాసింజర్ రైలు
X
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్, బాదంపహార్ రూట్‌లో మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. టాటా-బాదంపహార్ రూట్‌లో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. ప్యాసింబర్ రైలు ఆదివారం మినహా ప్రతిరోజూ 09.55 గంటలకు టాటానగర్ నుండి బయలుదేరి 12.15 గంటలకు బాదంపహార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, ఆదివారం మినహా ప్రతిరోజూ 12.45 గంటలకు బదంపహార్ నుండి బయలుదేరి 15.20 గంటలకు టాటానగర్ చేరుకుంటుంది. ఇది హలుద్‌పుకుర్, ఔన్‌లాజోరి, రాయంగ్‌పూర్, కుల్దిహా మరియు ఛన్వాలో ఆగుతుంది.
ఈ ప్యాసింజర్ రైలుతో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న స్థానికుల డిమాండ్‌ను నెరవేర్చామని రైల్వే మంత్రి అన్నారు. రాష్ట్రపతి సొంత జిల్లా మయూర్‌భంజ్‌కు మూడు కొత్త రైళ్లను కేటాయించినట్టు తెలిపారు. ప్రతి శనివారం షాలిమార్-బాదంపహార్-షాలిమార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ 23.05 గంటలకు షాలిమార్ నుండి బయలుదేరి మరుసటి రోజు 05.40 గంటలకు బాదంపహార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి బాదంపహార్ నుండి 21.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 05.00 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. ఇది సంత్రాగచ్చి, ఖరగ్‌పూర్, ఝర్‌గ్రామ్, ఘట్సిలా, అసన్‌బోని, టాటానగర్, బహల్దా రోడ్, ఔన్‌లాజోరి మరియు రాయ్‌రంగ్‌పూర్‌లలో ఆగుతుంది.
బాదంపహార్-రూర్కేకా-బాదంపహార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం బాదంపహార్ నుండి 06.10 గంటలకు బయలుదేరి అదే రోజు 11.40 గంటలకు రూర్కెలా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి రూర్కెలా నుండి 14.20 గంటలకు బయలుదేరి 19.25 గంటలకు బాదంపహార్ చేరుకుంటుంది. ఇది రాయ్‌రంగ్‌పూర్, ఔన్లాజోరి, బహల్దా రోడ్, టాటానగర్, సినీ, రాజ్‌ఖర్స్వాన్, చక్రధర్‌పూర్, గోయిల్‌కేరా మరియు మనోహర్‌పూర్‌లలో ఆగుతుంది.
రూర్కెలా- టాటానగర్ -రూర్కెలా ఆదివారం మినహా రోజూ 04.50 గంటలకు రూర్కెలా నుండి బయలుదేరి 09.15 గంటలకు టాటానగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, రైలు ఆదివారం మినహా ప్రతిరోజూ 15.25 గంటలకు టాటానగర్ నుండి బయలుదేరి 19.35 గంటలకు రూర్కెలా చేరుకుంటుంది. ఇది బిస్రా, మనోహర్‌పూర్, చక్రధర్‌పూర్, సినీ మరియు ఆదిత్యపూర్‌లలో ఆగుతుంది.