Home > జాతీయం > గుడ్ న్యూస్.. వందేభారత్‌ రైళ్ల టికెట్‌ ధరలు తగ్గించే ఛాన్స్‌

గుడ్ న్యూస్.. వందేభారత్‌ రైళ్ల టికెట్‌ ధరలు తగ్గించే ఛాన్స్‌

గుడ్ న్యూస్.. వందేభారత్‌ రైళ్ల టికెట్‌ ధరలు తగ్గించే ఛాన్స్‌
X

ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఛార్జీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. తక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఛార్జీలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ధరలను తగ్గిస్తే.. ఖాళీగా ఉన్న సీట్లకు కూడా ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది.





దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరి కొన్ని సర్వీసులు ప్రారంభించేందుకు సిద్దం అయ్యాయి. ప్రారంభించిన పలు రైళ్లు అంచనాలకు మించి ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయి. కొన్ని రైళ్లకు మాత్రం అంత ఆదరణ కనిపించటం లేదు. ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్‌పూర్, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ మార్గాల మధ్య నడుస్తున్న వందే భారత్ రైళ్లలో చాలా వరకు సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. గత నెల జూన్ వరకు భోపాల్-ఇండోర్ వందే భారత్ రైలులో 29 శాతం సీట్లు మాత్రమే నిండాయి. ఇండోర్-భోపాల్ రైలులో కేవలం 21 శాతం సీట్లు రిజర్వ్ అయ్యాయి. 70 శాతం రైలు ఖాళీగా ఉంటున్న తరుణంలో ఛార్జీలు తగ్గిస్తే.. వందే భారత్ రైలుకు ఆదరణ పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ఈ మార్గాల్లో మూడు గంటల పాటు ప్రయాణం ఉంటుండగా.. ఏసీ చైర్ కార్ ధర రూ.950, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర 1525 రూపాయలుగా ఉంది.

ప్రస్తుతం మన దేశంలో అత్యాధునిక వసతులతో అత్యంత వేగంగా నడిచే ట్రైన్ వందేభారత్. సుదీర్ఘ ప్రయాణం 10 గంటలు కాగా.. అతి తక్కువ ప్రయాణం 3 గంటలు. ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉండగా.. తక్కువ దూరం ప్రయాణించే రైళ్లపై ప్రయాణికులు ఆసక్తి చూపించడం లేదు. ఈ వందే భారత్ రైళ్లలో ఛార్జీలను తగ్గిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవ్వడంతో రైల్వే అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.




Updated : 6 July 2023 8:58 AM IST
Tags:    
Next Story
Share it
Top