Home > జాతీయం > రైల్వేశాఖ కీలక నిర్ణయం..

రైల్వేశాఖ కీలక నిర్ణయం..

రైల్వేశాఖ కీలక నిర్ణయం..
X

రైళ్లలో జనరల్ బోగీలో ప్రయాణించి వారి కష్టాలు గురించి చెప్పకర్లేదు. తినడానికి తిండి, తాగడానికి వాటర్ లేకుండా కిక్కిరిసి ప్రయాణిస్తారు. బయట కొని తిందామంటే ధరలు షాకిస్తాయి. ఇలా అరకొర సదుపాయాలతోనే వారి సుదూర ప్రయాణం కొనసాగుతాది. దీంతో జనరల్‌ బోగీ ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటు ధరలోనే ఆహారాన్ని, నీటి సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది.

ప్రతి రైల్వే స్టేషన్లలో జనరల్‌ కోచ్‌ ఆగేచోట తక్కువ ధరకే ఫుడ్, మంచి నీరును విక్రయించేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. జనరల్‌ కోచ్‌ మీల్స్‌ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. రూ.20లకే ఏడు పూరీలు, డ్రై ఆలూ, పికిల్‌తో కూడిన ప్యాక్‌ను అందిస్తారు. ఇక రెండో కేటగిరీల్లో రూ.50కి అన్నం, రాజ్మా, ఛోలే, కిచిడీ, కుల్చే, భతురే, పావ్‌ బాజీ, మసాలా దోశ.. ఇలా ఏదో ఒక ఆహారాన్ని పొందవచ్చు. ఈ ఆహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన కౌంటర్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనేదిది జోనల్‌ రైల్వే అధికారులకు అధికారం అప్పగించింది.

ప్రస్తుతం 51 స్టేషన్లలో ఈ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. గురువారం నుంచి మరరో 13 స్టేషన్లలో ప్రారంభం కానున్నాయి. ఆహారంతోపాటు 200 ఎంఎల్‌ వాటర్‌ గ్లాసులను కూడా ఈ కౌంటర్లలో విక్రయిస్తారు. తొలుత ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు దీన్ని అమలు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Updated : 19 July 2023 9:42 PM IST
Tags:    
Next Story
Share it
Top