ఎన్సీపీ చీలిక మీద రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు
X
మహారాష్ట్రలో ఎన్సీపీ సంక్షోభం మీద రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం శరద్ పవారే చేశారని ఆయన ఆరోపించారు. కర్మ ఫలం అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు.ఎన్సీపీ సంక్షోభం శరద్ పవార్ ఆశీస్సులతోనే జరిగిందంటూ ఆరోపించారు రాజ్ థాక్రే. మహారాష్ట్రలో ఇప్పుడు అసహ్యకరమైన రాజకీయాలు జరుగుతున్నాయంటూ ఘాటుగా విమర్శించారు. ఇది ముమ్మాటికీ ఓటర్లను అవమానించడమేనని రాజ్ థాక్రే అన్నారు. అసలు ఇలాంటి రాజకీయాలు మహారాష్ట్ర మొదలుపెట్టింది శరద్ పవారేనని అన్నారు. 1978లో పులోద్ పేరుతో పార్టీని చీల్చారు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఇలాంటివి శరద్ పవార్ తోనే మొదలై, ఆయనతోనే ముగుస్తాయేమో అన్నారు రాజ్ థాక్రే. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆయన చేజేతులా చేసుకున్నదే అని వ్యాఖ్యానించారు.దీంతో పాటు ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే పాటిల్, ఛాగన్ భుజ్ బల్ లు అజిత్ పవార్ వెంట వెళ్ళే వ్యక్తులు ఎంత మాత్రం కాదని రాజ్ థాక్రే అన్నారు. కచ్చితంగా వీళ్ళకి శరద్ పవార్ సపోర్ట్ ఉందని ఆరోపించారు.