Home > జాతీయం > Madhya Pradesh Results : రాజస్థాన్లో బీజేపీ.. మధ్యప్రదేశ్లో హోరాహోరీ.. ఎక్కడ ఏ పార్టీ అంటే..?

Madhya Pradesh Results : రాజస్థాన్లో బీజేపీ.. మధ్యప్రదేశ్లో హోరాహోరీ.. ఎక్కడ ఏ పార్టీ అంటే..?

Madhya Pradesh Results : రాజస్థాన్లో బీజేపీ.. మధ్యప్రదేశ్లో హోరాహోరీ.. ఎక్కడ ఏ పార్టీ అంటే..?
X

ఇవాళ్టితో 5 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ అయిపోయింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీజేపీ - కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ క్రమంలో తెలంగాణతో పాటు మిగితా రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ - కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కోల్పోనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మరోసారి కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. ఇక మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ - కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ ఉండబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

రాజస్థాన్‌లో గహ్లోత్‌కు షాక్‌..!

రాజస్థాన్‌లో 200 స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు షాక్‌ తగిలే అవకాశాలున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. కానీ తాము మళ్లీ అధికారం నిలబెట్టుకుంటామని కాంగ్రెస్‌ ధీమాతో ఉంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మాత్రం మరోసారి సంప్రదాయమే రిపీట్‌ కానుందని అంచనా వేస్తున్నాయి. అయితే బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో హస్తం

మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలుపొందాలి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ పార్టీకి పట్టం కట్టలేదు. కొన్ని కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయంటే.. మరికొన్ని బీజేపీకి అధిక సీట్లు వస్తాయని అంచనా వేశాయి. దీంతో ఫలితాల రోజే ఇక్కడి భవిష్యత్ తేలనుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మళ్లీ కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు పట్టం కడతారని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అదే సమయంలో గత ఎన్నికల్లో 15 స్థానాలకే పరిమితమైన బీజేపీకి ఈ సారి ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు తెలిపాయి. మిజోరంలో 40 స్థానాలకు ఎన్నికలు జరిగ్గా.. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్‌, జెడ్పీఎం మధ్యే ప్రధాన పోటీ ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంఎన్‌ఎఫ్‌కు, జడ్‌పీఎంకు మధ్య గట్టిపోటీ ఉండే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.


Updated : 30 Nov 2023 3:50 PM GMT
Tags:    
Next Story
Share it
Top