Home > జాతీయం > Shantan : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. హత్య కేసులో నిందితుడు శాంతన్ మృతి

Shantan : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. హత్య కేసులో నిందితుడు శాంతన్ మృతి

Shantan : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. హత్య కేసులో నిందితుడు శాంతన్ మృతి
X

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మృతి చెందాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతు ఆయన చెన్త్నెలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఆస్పత్రిలో మరణించారు. రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన శాంతన్ నవంబర్ 2022లో విడుదలయ్యాడు. శ్రీలంకకు చెందిన ఇతడు ఎల్టీటీఈ లో పని చేసేవాడు. అతను నవంబర్ 2022 లో సుప్రీంకోర్టు ద్వారా విడుదలయ్యాడు. అప్పటి నుండి తమిళనాడులోని తిరుచ్చి సెంట్రల్ జైలు క్యాంపస్‌లోని ప్రత్యేక శిబిరంలో ఉంచబడ్డాడు. చెన్నైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) ఫిబ్రవరి 23న అతడిని బహిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేయగా,మరో రెండు రోజుల్లో శ్రీలంకకు పంపించనున్నట్లు తెలిసింది.





అయితే, ఫిబ్రవరి ప్రారంభంలో శాంతన్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరాడు. ఈ రో ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతను క్రిప్టోజెనిక్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నాడు.1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ధను మహిళ తనను తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్‌తో పాటు మరో 14 మంది మరణించారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేల్చుతూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణ శిక్ష విధించింది. ఐతే ఆ మరుసటి ఏడాది పేరరివాళన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అనంతరం 2014లో పేరరివాళన్‌తో పాటు శాంతన్, మురుగన్ మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించింది. 2000లో సోనియా గాంధీ జోక్యంతో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు.




Updated : 28 Feb 2024 11:03 AM IST
Tags:    
Next Story
Share it
Top