Home > జాతీయం > Rajya Sabha Election 2024 : రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌-ఓటింగ్‌.. అంచనాలు తారుమారు

Rajya Sabha Election 2024 : రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌-ఓటింగ్‌.. అంచనాలు తారుమారు

Rajya Sabha Election 2024 : రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌-ఓటింగ్‌.. అంచనాలు తారుమారు
X

రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. మూడు(కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌) రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి రిటైర్ అవుతున్న 52 మంది సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 రాష్ట్రాల్లోని 15 స్థానాలకు ఈరోజు ఎన్నికలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లోని 10, కర్ణాటకలో 4, హిమాచల్ ప్రదేశ్ లో 1 రాజ్య సభ స్థానాలకు ఓటింగ్ ఫిబ్రవరి 27న ఉదయం 9గంటలకు ప్రారంభమై.. సాయంత్ర 4గంటలకు పూర్తైయాయి. కర్ణాటకలో క్రాస్ ఓటింగ్ జరిగి ఫలితాలు తారుమారు అయ్యాయి. సాయంత్రం 5గంటల నుంచి పోలైయిన ఓట్లను లెక్కిస్తున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో బీజేపీకి అనుకూలంగా ప్రత్యర్థులు ఓటు వేయగా.. కర్ణాటకలో మాత్రం బీజేపికి ఎదురుదెబ్బ తగిలింది. హిమాచల్ లో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి కాంగ్రెస్ అభ్యర్ధి అభిషేక్ మను సింఘ్వీకికి బదులుగా బీజేపీ అభ్యర్ధి హర్ష్ మహాజన్ కు ఓటేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ.. అక్కడ బీజేపీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి జై కొట్టారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్‌ సింఘ్వీకి నిరాశే ఎదురైంది.

కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్‌ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ మాకెన్‌కు ఓటేసినట్లు సమాచారం. మరో ఎమ్మెల్యే శివరాం హెబ్బర్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో విజయం ఖాయం కాగా.. బీజేపీకి ఒకచోట అవకాశం లభించింది.ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ ఆందోళనల జరిగాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎస్పీ లు వరుసగా 7, 3 సభ్యులను ఏకపక్షంగా రాజ్యసభకు పంపగల సామర్థ్యం ఉంది. క్రాస్ ఓటింగ్ దృశ్యా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఎన్నికలకు ట్విస్ట్ ఇస్తూ బీజేపీ తన ఎనిమిదో అభ్యర్థిగా సంజయ్ సేథ్‌ను రంగంలోకి దించింది.

Updated : 27 Feb 2024 4:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top