Rajya Sabha : నేడు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్
X
నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవల్టి నుంచి ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అటు తెలంగాణ, ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఈనెల 16న నామినేషన్లను పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. అనంతరం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ధ్రువపత్రాలను అందిస్తారు. లేకుంటే ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజూ సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెంటనే వెల్లడించనున్నారు.
ఇటు బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనున్నది. అయితే, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం 65 మంది ఎమ్మెల్యేలు కాగా, రెండు ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక స్థానం దక్కేందుకు అవకాశం ఉంది.