Home > జాతీయం > రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
X

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యింది. మొత్తం 15 రాష్ట్రాల్లో 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్‌ రిలీజ్ అయ్యింది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. దీనికి సంబంధించి ఫిబ్రవరి 8న నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది. తెలంగాణలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, ఏపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ల పదవీకాలం ముగియనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో 6 స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


Updated : 29 Jan 2024 2:35 PM IST
Tags:    
Next Story
Share it
Top