Home > జాతీయం > Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల్లో కాషాయ పార్టీ హవా.. 10 స్థానాలు కైవసం

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల్లో కాషాయ పార్టీ హవా.. 10 స్థానాలు కైవసం

Rajya Sabha Elections  : రాజ్యసభ ఎన్నికల్లో కాషాయ పార్టీ హవా.. 10 స్థానాలు కైవసం
X

రాజ్యసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. దేశంలో 15 రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా,బీజేపీ అత్యధికంగా 10 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించింది. గెలుపుకు కావాల్సిన సంఖ్యా బలం లేనప్పటికీ క్రాస్ ఓటింగ్ వల్ల బీజేపీ హిమాచల్‌ప్రదేశ్ ఉత్తరప్రదేశ్‌లో చెరో ఒక సీటు అదనంగా గెలుచుకుంది. కర్ణాటకలో కమలం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇక, కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అధికార హస్తం పార్టీ 3 స్థానాలు చేజిక్కించుకుంది. బీజేపీకి ఒక స్థానం లభించింది. సొంత ఎమ్మెల్యే ఎస్.టి. సోమశేఖర్ క్రాస్ ఓటింగ్ కు పాల్పడడం బీజేపీ అవకాశాలను దెబ్బతీసింది. యూపీలో బీజేపీ తన అధిపత్యం తన జైత్రయాత్రన్ని కొనసాగించింది. 8 రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకుంది. మిగతా రెండు స్థానాలు విపక్ష సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. దీనిపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ.. రాజ్యసభ ఎన్నికలతో బీజేపీ విజయ యాత్ర మొదలైందని, అది లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని అన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిగింది. ఒకే ఒక రాజ్యసభ స్థానాన్ని అదృష్టం కొద్దీ బీజేపీ చేజిక్కించుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరికీ సమానంగా 34 ఓట్ల చొప్పున లభించాయి. దాంతో 'టాస్' విధానాన్ని ఆశ్రయించగా, బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజేతగా నిలిచినట్టు ప్రకటించారు. రాజ్యసభలో ఖాళీ కానున్న 56 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. అందులో 41 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ 15 స్థానాలకు కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే పలు పార్టీలకు క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం చూపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి అనుకూలంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓటు వేయగా.. కర్ణాటకలో మాత్రం కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.




Updated : 28 Feb 2024 7:26 AM IST
Tags:    
Next Story
Share it
Top