Rajya Sabha:బీఆర్ఎస్ ఎంపీలకు షాక్.. నోటీసులు జారీ చేసిన రాజ్యసభ ఆఫీస్
Krishna | 13 Nov 2023 10:51 PM IST
X
X
బీఆర్ఎస్ ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ షాకిచ్చారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు చైర్మన్ ప్రివిలేజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఫిర్యాదు మేరకు చైర్మన్ కార్యాలయం ఈ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్‌లో జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు హౌస్‌లో ప్లకార్డులు ప్రదర్శించడంపై బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన చైర్మన్.. దీనిపై విచారణ జరపాలని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీ.. బీఆర్ఎస్ ఎంపీలు కే.కేశవరావు, సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, దామోదర్ రావుకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28లోపు సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.
Updated : 13 Nov 2023 10:51 PM IST
Tags: brs mps notices to brs mps brs rajya sabha mps telangana rajya sabha mps rajya sabha chairman notices to brs mps privilege notice privilege notice to brs mps mp keshav rao mp suresh reddy mp vaddiraju ravichandra mp vivek thakur
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire