Home > జాతీయం > Ram Mandir : రామ మందిరంలో కర్నాటక శిల్పి చెక్కిన విగ్రహం.. ప్రత్యేకతలేంటంటే..?

Ram Mandir : రామ మందిరంలో కర్నాటక శిల్పి చెక్కిన విగ్రహం.. ప్రత్యేకతలేంటంటే..?

Ram Mandir : రామ మందిరంలో కర్నాటక శిల్పి చెక్కిన విగ్రహం.. ప్రత్యేకతలేంటంటే..?
X

అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం రాముని విగ్రహం ఎంపిక ఖరారైంది. కర్నాటకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆంజనేయుడి జన్మభూమి అయిన కర్నాటక నుంచే శ్రీరాముని విగ్రహ ఎంపిక జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాముడు, హనుమంతునికి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి ఇదో ఉదాహరణ అని జోషి అభిప్రాయపడ్డారు. అయితే విగ్రహ ఎంపికకు సంబంధించి శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

నేపాల్ లోని గండకీ నదితో పాటు కర్నాటక, రాజస్థాన్, ఒడిశా నుంచి 12 నాణ్యమైన రాళ్లను అయోధ్య రామాలయ ట్రస్ట్ విగ్రహ రూపకల్పన కోసం సేకరించింది. వాటిని పరిశీలించిన అనంతరం కర్నాటకలో దొరికిన శ్యామ శిల, రాజస్థాన్ లోని మక్రానా మార్బుల్ రాక్ ఎంపిక చేశారు. అయితే వాటిలో శ్యామ శిల శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉండటంతో పాటు నీటి నిరోధకతలను కలిగి ఉంటాయి. జీవితకాలం కూడా ఎక్కువే. ఈ క్రమంలో విగ్రహం చెక్కేందుకు శ్యామరాయికి ప్రాధాన్యం ఇచ్చారు.

కర్నాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్(37) రాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఎంబీఏ చదివిన ఆయన.. యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. 2008లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి శిల్పకారునిగా మారిన అరుణ్ యోగిరాజ్.. మహారాజా జయచామరాజేంద్ర వడయార్‌ సహా అనేక మంది ప్రముఖుల విగ్రహాలు తయారు చేశారు. కేదార్‌నాథ్‌లో స్థాపించిన ఆదిశంకరాచార్య. మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-IV, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం, ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా ఆయనే తీర్చిదిద్దారు.




Updated : 2 Jan 2024 8:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top