Home > జాతీయం > జమిలి ఎన్నికలపై కోవింద్ నేతృత్వంలో ముగిసిన తొలి భేటీ

జమిలి ఎన్నికలపై కోవింద్ నేతృత్వంలో ముగిసిన తొలి భేటీ

జమిలి ఎన్నికలపై కోవింద్ నేతృత్వంలో ముగిసిన తొలి భేటీ
X

వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ అధ్యయనం కోసం ఏర్పాటు కమిటీ తొలి భేటీ ముగిసింది. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలపై అభిప్రాయాల సేకరించడంతో పాటు రాజకీయపార్టీల సూచనలు స్వీకరించాలని డిసైడ్ అయింది.

కమిటీ తొలి భేటీలో సభ్యులకు సమావేశం అజెండాను ఛైర్మన్ కోవింద్ వివరించారు. ఈ మీటింగ్కు హోం మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరీతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ఇవాళ్టి భేటీలో కమిటీ జమిలి ఎన్నికలపై అభిప్రాయాల సేకరణ కోసం దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను సైతం ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. వీరితో పాటు పార్లమెంట్‌లో ప్రతినిధులుగా ఉన్న రాజకీయ పార్టీలకూ ఆహ్వానం పంపనున్నారు.

Updated : 23 Sept 2023 10:14 PM IST
Tags:    
Next Story
Share it
Top