Home > జాతీయం > Non Bailable Warrant: సినీ నటి జయప్రదపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

Non Bailable Warrant: సినీ నటి జయప్రదపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

Non Bailable Warrant: సినీ నటి జయప్రదపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌
X

ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద (Jayaprada)పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. న్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్‌ 21కి వాయిదా వేసింది. జయప్రదపై ఈ ఉల్లంఘన కేసు 2019లోనే స్వార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థాన ధర్మాసనం ఆదేశించినా ఆమె హాజరుకాలేదు. పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది.

తాజాగా సోమవారం రోజున జయప్రద కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే సోమవారం కూడా ఆమె తరఫు న్యాయవాది హాజరు నుంచి మినహాయింపు కోసం దరఖాస్తును సమర్పించారు. అయితే దానిని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే జయప్రదపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్‌నాథ్ తివారీ తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 21న జరగనుంది. గత ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన జయప్రద సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్ చేతిలో ఓటమిపాలయ్యారు.

Updated : 17 Oct 2023 12:45 PM IST
Tags:    
Next Story
Share it
Top