ఆగస్టులో 14 రోజులు బ్యాంక్ సెలవులు.. చెక్ చేసుకుని వెళ్ళండి
X
ఆర్బీఐ.. బ్యాంక్ కస్టమర్ల అవసరాల కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ లిస్ట్‌ను ముందుగానే ప్రకటిస్తుంటుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవులు ఈ లిస్ట్ లో చేర్చుతారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెలకు సంబంధించిన హాలిడేస్ లిస్ట్ ను కూడా ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. ఆగస్ట్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 14 రోజుల సెలవులు ఉన్నాయి. ఆగస్ట్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులో చూద్దాం..
ఆగస్ట్ నెలలో బ్యాంకులకు సెలవులు:
ఆగస్టు 06వ తేదీ- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 08వ తేదీ- మంగళవారం.. టెండోంగ్ లో రమ్ ఫాత్ పండుగ. సిక్కింలో బ్యాంక్ సెలవు
ఆగస్టు 12వ తేదీ- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 13వ తేదీ- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 15వ తేదీ-మంగళవారం.. స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 16వ తేదీ- బుధవారం.. పార్సీ నూతన సంవత్సరం- షాహెన్‌షాహి (బేలాపూర్, ముంబై, నాగ్‌పుర్‌లలో బ్యాంకులకు సెలవు)
ఆగస్టు 18వ తేదీ- శుక్రవారం.. శ్రీమంత శంకరదేవుని తిథి కారణంగా గువాహతిలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 20వ తేదీ- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 26వ తేదీ- నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 27వ తేదీ- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 28వ తేదీ-సోమవారం.. మొదటి ఓనం కారణంగా కోచి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 29వ తేదీ- మంగళవారం.. తిరువోణం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30వ తేదీ- బుధవారం.. రాఖీ పండుగ కారణంగా జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 31వ తేదీ- గురువారం.. రాఖీ పండుగ/శ్రీనారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్ కారణంగా డెహ్రాడూన్, గాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లఖ్‌నవూ, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు