Home > జాతీయం > జూన్‌లో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో

జూన్‌లో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో

జూన్‌లో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో
X

ఆర్బీఐ.. బ్యాంక్‌ కస్టమర్ల అవసరాల కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగానే ప్రకటిస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవులు ఈ లిస్ట్ లో ఉంటాయి. జూన్ నెలకు సంబంధించిన హాలిడేస్ లిస్ట్ ను కూడా ఆర్బీఐ విడుదల చేసింది. జూన్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులు ఉన్నాయి. జూన్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు చూద్దాం..

జూన్ 4వ తేది- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూన్ 10వ తేది- రెండో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూన్ 11వ తేది - ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూన్ 15వ తేది- రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులు పని చేయవు

జూన్ 18వ తేది- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూన్ 20వ తేది- రథయాత్ర కారణంగా ఒడిశాలో బ్యాంకులు పని చేయవు

జూన్ 24వ తేది- నాలుగో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూన్ 25వ తేది-ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూన్ 26వ తేది- ఖర్చీ పూజ నేపథ్యంలో త్రిపురలో బ్యాంకులు పని చేయవు

జూన్ 28వ తేది- ఈద్ ఉల్ అజా కారణంగా కేరళ, మహారాష్ట్ర, జమ్ము, కశ్మీర్‌లో బ్యాంకులను మూసిస్తారు

జూన్ 29వ తేది- ఈద్ ఉల్ అజా సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు

జూన్ 30వ తేది- మిజోరాం, ఒడిశాలో ఈద్ ఉల్ అజా కారణంగా బ్యాంకులను మూసివేస్తారు

Updated : 31 May 2023 9:06 PM IST
Tags:    
Next Story
Share it
Top