Home > జాతీయం > SBIలో నకిలీ నోట్లు.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన RBI

SBIలో నకిలీ నోట్లు.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన RBI

SBIలో నకిలీ నోట్లు.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన RBI
X

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐలోనే నకిలీ నోట్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఆ నకిలీ నోట్లను ఏకంగా రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియాకే పంపించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లోని పుఖారాయం శాఖలో జరిగింది. దీనిని గమనించిన ఆర్​బీఐ అధికారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంబంధిత బ్యాంక్ అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భోగనిపుర్​ పరిధిలోని పుఖారాయం SBI బ్రాంచ్ నుంచి కొంత నగదును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు పంపించారు. వీటిని ఆర్​బీఐ అధికారులు పరిశీలించగా.. అందులో కొన్ని ఫేక్​ నోట్లుగా(Fake Currency) తేలాయి. వెంటనే ఈ విషయంపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ పుఖారాయం శాఖను కోరింది RBI. దీనిపై సంబంధిత బ్యాంక్ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఆర్​బీఐ.. నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్ బ్యూరోలో నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు SBI శాఖ అధికారులపై కేసు నమోదు చేశారు. రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా సెక్షన్ మేనేజర్​ ఐపీఎస్​ గహ్లోత్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, వెంటనే దర్యాప్తు చేపట్టామని భోగనిపుర్​ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్​ ప్రమోద్​ కుమార్ శుక్లా తెలిపారు. ఫేక్​ నోట్ల నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.




Updated : 11 Oct 2023 2:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top