సామాన్యుడికి ఊరట.. ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం
X
ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యుడికి ఆర్బీఐ కాస్త ఊరటనిచ్చింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించింది. పరపతి విధాన సమీక్షలో భాగంగా రెపో, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పులుచేయవద్దని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. తాజా నిర్ణయంతో రెపో రేటు 6.5శాతం వద్ద కొనసాగనుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు సైతం 6.75 శాతంగా కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు.
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిచ్చే ప్రయత్నంలో భాగంగా కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయకపోవచ్చునని గతకొంత కాలంగా విశ్లేషణలు చెబుతున్నారు వారి అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం ఆధారంగా వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయం తీసుకుంటామని శక్తికాంత దాస్ ప్రకటించారు. ఏడాదంతా ద్రవ్యోల్బణం 4శాతానికి పైగానే కొనసాగుతుందని అంచనా వేస్తన్నట్లు చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠానికి దిగివచ్చింది. దీంతో ఏప్రిల్ లో జరిగిన పరపతి విధాన సమీక్షలోనూ ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకుగానూ 2022 మే నుంచి ఆర్బీఐ వరుసగా ఆరుసార్లు రెపో రేటు పెంచింది. దీంతో రెపోరేటు 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది.
MPC (Monetary Policy Committee) decided to keep the policy repo rate unchanged at 6.5%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/Se8GDvCvPy
— ANI (@ANI) June 8, 2023