రూ.2వేల నోట్ల మార్పిడి గడువు పెంచే ఛాన్స్..!
X
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్ల మార్పిడి కోసం ఇచ్చిన గడువు శనివారంతో ముగియనుంది. సెప్టెంబర్ 2 వరకు 93 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ నోట్ల మార్పిడి గడువు పొడిగిస్తుందా? లేదా అన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నోట్ల మార్పిడి గడువు పొడగింపుపై ఆర్బీఐ మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే రూ.2వేల నోట్ల మార్పిడిని మరో నెల రోజుల పాటు పొడగించనున్నట్లు సమాచారం.
ఎన్ఆర్ఐలు, ఇతర వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకులో జమ చేయడానికి గడువు పొడిగించాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ గడువు అక్టోబర్ 31 వరకు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి 2023 మే 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు దాదాపు 4 నెలలు గడువు ఇచ్చింది. దీనిపై శనివారం ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.