Home > జాతీయం > ఆర్బీఐ ఆదేశం.. ఆదివారం కూడా బ్యాంకులు తెరిచే!

ఆర్బీఐ ఆదేశం.. ఆదివారం కూడా బ్యాంకులు తెరిచే!

ఆర్బీఐ ఆదేశం.. ఆదివారం కూడా బ్యాంకులు తెరిచే!
X

ప్రతి ఏటా ఆర్ధిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఈ ఏడాది (2023-24) ఆర్థిక సంవత్సరం మరో పది రోజుల్లో ముగియనుంది. అయితే ఈసారి ఆర్థిక సంవత్సరం ఆదివారం ఉండటంతో.. ఆర్బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. అయితే ఆర్ధిక సంవత్సరం ఆదివారంతో ముగుస్తున్న కారణంగా.. ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వం లావాదేవీలు నిర్వహించే అన్ని బ్యాంకులు ఆదివారం (మార్చి 31) కచ్చితంగా పనిచేయాల్ని ఆర్బీఐ ఆదేశించింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ప్రకటిస్తారు. కాగా ఆర్థిక సంవత్సరం ముగింపు ఉన్న కారణంగా మార్చి 31న బ్యాంకులు తెరిచే ఉంచాలని ఆర్‌బీఐ సూచించింది.

ఆర్థిక సంవత్సరం ముగింపు రోజున ప్రభత్వానికి చెందిన లావాదేవీలు, చెల్లింపులు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా ఆర్బీఐ సూచనల మేరకు బ్యాంకులు పనిచేయాల్సి ఉంటుంది. దీంతో మార్చి 31న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సాధారణ పనిదినాల్లానే ఆదివారం కూడా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలు కూడా బ్యాంకు సేవలను వినియోగించుకోవచ్చు.

Updated : 21 March 2024 12:14 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top