Home > జాతీయం > యూపీఏ చెల్లింపు రూ. 5 లక్షలకు పెంపు... కండీషన్ అప్లై

యూపీఏ చెల్లింపు రూ. 5 లక్షలకు పెంపు... కండీషన్ అప్లై

యూపీఏ చెల్లింపు రూ. 5 లక్షలకు పెంపు... కండీషన్ అప్లై
X

యూపీఐ(unified payment interface) చెల్లింపుల మొత్తాన్ని ఆర్బీఐ రూ. 5 లక్షలకు పెంచింది. అయితే కేవలం ఆస్పత్రులు, విద్యాసంస్థలకు చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. ఆస్పత్రి బిల్లులు, కాలేజీల ఫీజులు భారీ మొత్తంలో ఉండడంతో నగదుకు ఇబ్బందిపడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాల్లో మార్పుచేర్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, రికరింగ్‌ చెల్లింపుల కోసం ఇచ్చే ఈ-మ్యాండేట్‌ పరిమితిని కూడా ప్రస్తుత పరిమితి రూ.15 వేల నుంచి రూ.1 లక్షకు పెంచింది. ప్రస్తుతం ఆటో డెబిట్‌ మొత్తం రూ.15 వేలు దాటితే ‘అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌’ కింద ఖాతాదారులు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సి వస్తోంది. ఇకపై రూ.1 లక్ష వరకు ఇలాంటి అనుమతి అవసరం ఉండదు. మ్యూచువల్‌ ఫండ్‌ సబ్‌స్క్రిప్షన్‌, బీమా ప్రీమియం, క్రెడిట్‌ కార్డు బిల్లులు సజావుగా సాగిపోయే వీలుంది.

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. కీలక రేట్లలో మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఐదోసారి. 2023-24లో దేశ జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి) వృద్ధిరేటు అంచనాను ఆర్బీఐ 6.5 శాతం నుంచి 7 శాతానికిపెంచింది. మూడో త్రైమాసికంలో 6.5 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

Updated : 8 Dec 2023 11:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top