Home > జాతీయం > 2000 Rupees : ఇంకా మార్కెట్‌లోనే రూ. 9330 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు.. మార్చనదిదెవరు?

2000 Rupees : ఇంకా మార్కెట్‌లోనే రూ. 9330 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు.. మార్చనదిదెవరు?

2000 Rupees  : ఇంకా మార్కెట్‌లోనే రూ. 9330 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు.. మార్చనదిదెవరు?
X

రూ. 2000 నోట్లను చెలామణిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19వ తేదీన నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో ఎక్సేంజ్ చేసుకోవడానికి కానీ సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. ఆర్బీఐ విధించిన గడువు ముగిసిన బ్యాంక్‌లకు 100 శాతం నోట్లు తిరిగి రాలేదు. దీంతో RBI రూ. 2000 రూపాయల నోట్లకు సంబంధించి గతంలో ఓ ప్రకటనను విడుదల చేసింది. రూ. 9760 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు బ్యాంక్ ల్లో ఇంకా డిపాజిట్ కాలేదని తెలిపింది. డిసెంబర్ 29న,మరో ప్రకటనను విడుదల చేసిన ఆర్బీఐ.. బ్యాన్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు 97.38 శాతం నోట్లు తిరిగి వచ్చినట్లు తెలిపింది. గతేడాది మే 19, 2023న మార్కెట్‌లో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉండగా, డిసెంబర్ 29, 2023 నాటికి ఈ సంఖ్య రూ.9,330 కోట్లకు తగ్గింది. దీని ప్రకారం డిసెంబర్ నెలాఖరు వరకు కూడా 2.62 శాతం పింక్ నోట్లు చలామణిలో ఉన్నాయి.

క్లీన్ నోట్ పాలసీ కింద,

క్లీన్ నోట్ పాలసీ కింద 19 మే 2023న దేశంలో చెలామణిలో ఉన్న అధిక విలువ గల రూ. 2000 నోటును ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ భావించింది. ప్రజల వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో ఎక్సేంజ్ చేసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ 23 మే నుండి 30 సెప్టెంబర్ 2023 వరకు సమయం ఇచ్చింది. గడువు ముగిసిన 100% నోట్లు తిరిగి రాకపోవడంతో 7 అక్టోబర్ 2023 వరకు గడువును పొడిగించింది. అక్టోబర్ 7 తర్వాత కూడా పూర్తి స్థాయిలో నోట్లు తిరిగి జమ కాకపోవడంతో నోట్లు మార్చుకునేందుకు మరిన్ని రోజుల పాటు అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాల్లో నోట్లను ఎక్స్ఛేంజి చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది. ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపి కూడా బ్యాంక్ ఖాతాల్లో ఆ నోట్లను జమ చేసుకోవచ్చని తెలిపింది

Updated : 2 Jan 2024 11:32 AM IST
Tags:    
Next Story
Share it
Top