చీరలో మహిళ జిమ్ వర్కౌట్స్.. నెట్టింట్లో వీడియో వైరల్
X
చీర కట్టుకునే చాలా మంది స్త్రీలు ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఫంక్షన్లు, పెళ్లిళ్లు, లేదా ఏదైన శుభకార్యాలకు మాత్రమే చీరలు పనికొస్తాయి అని భావిస్తుంటారు. కానీ అదంతా ట్రాష్ అని కొంత మంది కొట్టిపడేస్తున్నారు. మొన్నామధ్య చీరకట్టుతో ఏకంగా రన్నింగ్ చేసి విదేశంలో స్వదేశీ పవర్‌ను చూపించింది ఓ మహిళ. ఇవాళ జిమ్ వర్కౌట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది రీనా సింగ్ . తాజాగా చీరకట్టుకుని జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నఈ మహిళ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మహిళ ఎంతో ఈజీగా చీరతో వర్కౌట్స్ చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
జిమ్‌లో వర్కౌట్లు చేశేవారు ప్రత్యేకమైన డ్రెస్‌ను వేసుకుంటారు. వ్యాయామం చేసేందుకు ఆ బట్టలు తప్ప
వేరేవాటిని వేసుకోవడానికి ఇష్టపడరు. కానీ రీనా సింగ్ ఈ డ్రెస్ కోడ్ ను మార్చేసింది. చీరలో జిమ్ వర్కౌట్లు సునాయాసంగా చేస్తూ ఆనందిస్తుంది. ఏదో ఒకరోజు మాత్రమే కాదు, నిజానికి గత కొంతకాలంగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోల్లో రకరకాల ఫీట్లను, కఠినమైన వ్యాయామాలను చీరలోనే చేస్తోంది. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. బరువులు ఎత్తడం నుండి టిపికల్ వర్కౌట్స్ వరకు అన్నింటినీ చీరలోనే చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోలు నెటిజన్లను కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
రీనా సింగ్ ఓ ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు . సంప్రదాయాన్ని గౌరవించే మహిళ. జిమ్ చేస్తే ఈ దుస్తులతోనే చేయాలి అనే వాదాన్ని వ్యతిరేకిస్తుంది రీనా సింగ్ . అందుకే తన ఇష్టాన్ని జోడించి సంస్కృతిని స్వీకరించమని తన వీడియోల ద్వారా ఇతరులను ప్రోత్సహిస్తోంది.
రీనాకు సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చాలా మంది ఫాలో అవుతున్నారు.
నెటిజన్లు ఆమె వీడియోలు చూస్తూ ప్రశంసలతో ఇన్‌బాక్స్‌ను నింపేస్తుంటారు. మరికొందరు రీనా సేఫ్టీ గురించి జాగ్రత్తలు చెబుతుంటారు. చీర కట్టుకుంటే ఏ పనీ చేయలేమనుకునే మహిళలకు రీనా వీడియోలు ఎలాంటి సవాల్‌ను అయినా జయించవచ్చని నిరూపిస్తాయి. సో మహిళలు మీరు రీనాను చూసి శారీలో సాఫీగా సింపుల్ గా వర్కౌట్స్ చేయడం ప్రారంభించండి.