అంబానీ బుల్లెట్ ప్రూఫ్ కారు రేంజే వేరప్పా..సేఫ్టీ విషయంలో తగ్గేదేలే..
X
ఇండియన్ బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కార్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు దూకుడుగా ఉంటారు. తాజాగా ఆయన కార్ల లిస్టులో మోస్ట్ సేఫెస్ట్, 'బుల్లెట్ ప్రూఫ్' మెర్సిడెస్ బెంజ్‌కారు చేరింది. రూ.10 కోట్లకు పైనే ధర పలికే ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
బిలియనీర్ ముఖేష్ అంబానీ లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అత్యంత లగ్జరీ కార్లలో ప్రయాణిస్తుంటారు. తాజాగా మెర్సిడెస్-బెంజ్-S680 గార్డ్ బుల్లెట్‌ప్రూఫ్ సెడాన్‌ను అంబానీ కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి ఎస్ 680 గార్డ్ సెడాన్. ఈ మధ్య అంబానీకి బెదిరింపులు ఎక్కువవడంతో ఆయన భద్రత రిత్యా ఈ కొత్త కారు కొనుగోలు చేశాని ఇన్ఫర్మేషన్.
ఈ కారు ఫీచర్స్ చూస్తే మాత్రం ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మెర్సిడెస్-బెంజ్-S680 గార్డ్ బుల్లెట్‌ప్రూఫ్ సెడాన్ ఇతర మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కార్ల లాగానే కనిపిస్తుంది. కానీ మామూలు సెడాన్ కారు కంటే ఇది 2 టన్నుల బరువు అధికంగా ఉంటుంది . అలాగే దీని బాడీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ షెల్‌ను కలిగి ఉంది. కారులో బుల్లెట్, బ్లాస్ట్ ప్రూఫ్, మల్టీ-లేయర్ గ్లాస్ ఉన్నాయి. గన్‌లతో కాల్పులు జరిపినా, లోపలి వారిని రక్షించే కెపాసిటీ ఉండటం ఈ కారు స్పెషాలిటీ.
తుపాకీ కాల్పుల తాకిడిని తట్టుకోవడం మాత్రమే కాదు. ఇదిగ్రెనేడ్ల అటాక్‌ను కూడా తట్టుకోగలదు. అంతేకాదు ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా ఇది సంరక్షిస్తుంది. గంటకు 80 కిమీ వేగంతో ఈ కారు దూసుకెళ్తుంది. ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్‌తో 612 పవర్‌ను, 830 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంబానీల లగ్జరీ కార్ల లిస్ట్ చాలానే ఉంది. ఈ ఫ్యామీలీ కాన్వాయ్‌లో రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఇలా ఎన్నో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి.