Home > జాతీయం > సుప్రీంకోర్టులో రాహుల్‎ గాంధీకి ఊరట..రెండేళ్ల జైలు శిక్షపై స్టే

సుప్రీంకోర్టులో రాహుల్‎ గాంధీకి ఊరట..రెండేళ్ల జైలు శిక్షపై స్టే

సుప్రీంకోర్టులో రాహుల్‎ గాంధీకి ఊరట..రెండేళ్ల జైలు శిక్షపై స్టే
X

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 'మోదీ ఇంటి పేరు' కేసులో ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ట శిక్ష విధింపుపై ట్రయల్ కోర్టు సరైన కారణాలు చూపకపోవడంతో సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రజాజీవితంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ బహిరంగ సభల్లో ప్రసంగాలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని అందరూ ఆశిస్తారని ధర్మాసనం అభిప్రాయపడింది.

'మోదీ ఇంటి పేరు' కేసులో సూరత్ కోర్టు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఈ కేసు శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాహుల్‌ గాంధీ తరఫున సీనియర్‌ లాయర్ అభిషేక్‌ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. రాహుల్ పై పరువు నష్టం కేసు వేసి బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ అసలు ఇంటిపేరు ‘మోదీ ’ కాదని, మోదీ అనే పేరును ఆయన తర్వాత పెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాదు గతంలోనూ బీజేపీ నేతలు రాహుల్‎పై పలు కేసులు వేశారని, అయితే ఏ కేసులోనూ రాహుల్‎కు శిక్ష పడలేదని వాదించారు. పార్లమెంటుకు వెళ్లేందుకు , ఎలక్షన్స్‎లో పోటీ చేసేందుకు, రాహుల్ గాంధీ నిర్దోషి అని తేలేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పారు.

Updated : 4 Aug 2023 10:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top