Home > జాతీయం > ‘ఏం కర్మరా బాబూ.. బతకాలంటే ఇంత కష్టపడాలా’.. మరీ బాత్ రూంలో ఉండటమేంటి

‘ఏం కర్మరా బాబూ.. బతకాలంటే ఇంత కష్టపడాలా’.. మరీ బాత్ రూంలో ఉండటమేంటి

‘ఏం కర్మరా బాబూ.. బతకాలంటే ఇంత కష్టపడాలా’.. మరీ బాత్ రూంలో ఉండటమేంటి
X

దేశంలో నగరాలు ఎంతలా అభివృద్ధి చెందుతున్నాయంటే.. ‘పల్లెలన్నీ ఖాళీ అయి.. పొట్ట కూటి కోసం పట్నం వచ్చేంత. కాలరెగరేసి సొంతూళ్లో తిరిగినోడు.. ఆకలితో పస్తూలుండేంత. పూరి గుడిసెలో రాజాలా బతికినోడు.. ఇరుకు సంధుల్లో మగ్గిపోయేంత.’ మరి అంతలా కష్టపడితేగాని సిటీల్లో బతకడం కష్టం. అంతేకాదు సిటీల్లో ఇళ్లు కావాలంటే.. అదో యుద్ధం. చిన్న ఇళ్లయినా వేలల్లో రెంట్. అవి ఉండేదీ ఇరుకు ఇరుకే. అంత రేటు పెట్టి ఉండలేక సౌలతుల్లేని సిటీ శివారుళ్లో నివసిస్తుంటారు. ఈ పరిస్థితి దేశమంతా ఉంది. ప్రధాన నగరాలన్నిట్లో.. పరిస్థితి మరీ దారుణం. అలాంటి ఓ వార్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





‘చిన్న గది. అందులో బెడ్ విత్ అటాచ్డ్ బాత్ రూం. గది మూలలో గ్లాస్ ఫిటింగ్ తో స్నానానికి చోటు. ఏసీ, టేబుల్ ఫ్యాన్. అందులోనే కిచెన్ కూడా’ ఈ ఫొటోను రెడ్డిట్ లో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో రెంట్ తీసుకునేవాళ్ల పరిస్థితి ఇది అని క్యాప్షన్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్స్ అది గదా.. లేక సర్వ హంగులతో ఉన్న జైలా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి అనుభవిస్తూ.. చాలీ చాలని జీతానికి సిటీల్లో బతకడం అవసరమా అంటున్నారు.

What's the max rent you would pay for this kind of place in GK2?
by u/supermarketblues in delhi




Updated : 16 Aug 2023 7:53 PM IST
Tags:    
Next Story
Share it
Top