Home > జాతీయం > రిపబ్లిక్ డే వేడుకలు..మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ రోడ్ షో

రిపబ్లిక్ డే వేడుకలు..మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ రోడ్ షో

రిపబ్లిక్ డే వేడుకలు..మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ రోడ్ షో
X

75 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలో సర్వం సిద్దమయింది. జనవరి 26న జరిగే పరేడ్‌కు సంబంధించి ఢిల్లీ డ్యూటీ పాత్‌లో సైనికులు కవాతు చేస్తున్నారు. ఈ సమయంలో భారతదేశం ఈ వేడుకలో పాల్గొనడానికి అనేక మంది విదేశీ పర్యాటకులు రాజధాని ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆయన ఫ్రాన్స్ నుంచి నేరుగా రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చేరుకుంటారు. ప్రధాని మోదీ కూడా జైపూర్ కు చేరుకుంటున్నారు. ఇరువురు నేతలు జైపూర్ లో షికారు చేయనున్నారు. మాక్రాన్ తొలుత నగరంలోని అంబర్ కోటను దర్శిస్తారు. అక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షిస్తారు. ఆ తర్వాత జైపూర్ లో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జంతర్ మంతర్ కు వెళ్తారు.

జంతర్ మంతర్ టూర్ లో మాక్రాన్ తో మోదీ కలుస్తారు. అనంతరం ఇద్దరూ మోదీ,మాక్రన్ కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. ఈ సన్నాహాలు, వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు వేలాది మంది భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. మాక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఫైటర్ జెట్స్, సబ్ మెరైన్లకు సంబంధించి మల్టీ బిలియన్ డాలర్ల ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. మరో 26 రాఫెల్ ఫైటర్ జెట్లు, మూడు స్కార్పియన్ సబ్ మెరైన్ల కొనుగోలుపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీలో సందర్శకులు ఉదయం 8 గంటలకే వేదిక వద్దకు చేరుకోవాలని, తద్వారా తనిఖీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. జనవరి 25 రాత్రి 10 గంటల నుండి ఢిల్లీ సరిహద్దులు మూసివేయబడతాయి .ఈ సమయంలో భారీ వాహనాలు, గూడ్స్ వాహనాల రాకపోకలు నిలిపివేయబడతాయి

Updated : 25 Jan 2024 2:03 PM IST
Tags:    
Next Story
Share it
Top