Home > జాతీయం > Ayodhya Rama Mandiram : అయోధ్యలో మొదలైన సంబురాలు.. వారం పాటు కొనసాగనున్న క్రతువులు..

Ayodhya Rama Mandiram : అయోధ్యలో మొదలైన సంబురాలు.. వారం పాటు కొనసాగనున్న క్రతువులు..

Ayodhya Rama Mandiram  : అయోధ్యలో మొదలైన సంబురాలు.. వారం పాటు కొనసాగనున్న క్రతువులు..
X

అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్న మవుతోంది. ఈ నెల 22న ఈ మహాక్రతువు నిర్వహించనున్నారు. అయితే ప్రాణ ప్రతిష్ఠకు వారం ముందు నుంచే సంప్రదాయ క్రతువులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి రామ మందిరంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టిచేందుకు కర్నాటక మైసూరుకు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించిన ప్రతిమను ఎంపిక చేశారు. 150-200 కిలోల బరువుతో ఐదేళ్ల వయసున్న బాల రాముడి రూపంలో ఉన్న ఆ విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు. తామర రేకుల లాంటి కళ్లు, పెదవులపై నిర్మలమైన చిరునవ్వు, చంద్రుడిలా ప్రకాశించే ముఖంతో దైవత్వం ఉట్టిపడేలా ఉన్న విగ్రహ రూపంలో బాలరాముడు దర్శనమివ్వనున్నాడు. గత 7 దశాబ్దాలుగా రామ మందిరం వద్ద పూజలందుకుంటున్న రామ్‌లల్లా విగ్రహాన్ని సైతం గర్భగుడిలోనే పెట్టనున్నారు.

అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు ఈ రోజు నుంచి జనవరి 21 వరకు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఆ పూజల షెడ్యూల్ గమనిస్తే..

జనవరి 16- ప్రాయశ్చిత్త కార్యక్రమం, సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం, విష్ణుపూజ, గోపూజ

జనవరి 17- ఊరేగింపుతో అయోధ్యకు చేరుకోనున్న రామ్‌లల్లా విగ్రహం, మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకురానున్న భక్తులు

జనవరి 18- గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజ

జనవరి 19- యజ్ఞం, నవగ్రహ, హవన్ స్థాపన

జనవరి 20- రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీళ్లతో శుభ్రం చేస్తారు. అనంతరం వాస్తు శాంతి ‘అన్నాదివస్‌’ ఆచారాల నిర్వాహణ

జనవరి 21- రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం

జనవరి 22- మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రారంభం కానుంది. చివరి రోజు జరిగే ఈ మహాక్రతువుకు 150 దేశాల నుంచి భక్తులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 7 వేల మందికి ఆలయ ట్రస్టు ఆహ్వానాలు పంపింది. అయితే జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య రామ మందిరంలోకి సామాన్య భక్తులకు అనుమతి లేదని ట్రస్ట్ ప్రకటించింది. జనవరి 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శనమివ్వనున్నారు.




Updated : 16 Jan 2024 6:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top