Home > జాతీయం > రాహుల్‌.. ఇంకెప్పుడు..త్వరగా పెళ్లి చేసుకో : లాలూ

రాహుల్‌.. ఇంకెప్పుడు..త్వరగా పెళ్లి చేసుకో : లాలూ

రాహుల్‌.. ఇంకెప్పుడు..త్వరగా పెళ్లి చేసుకో : లాలూ
X

రాహుల్ గాంధీ.. ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. 53ఏళ్ల వయస్సు వచ్చిన ఆయన మాత్రం పెళ్లి సైడ్ వెళ్లడం లేదు. దీంతో పలుచోట్ల ఆయనకు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. భారత్ జోడో సమయంలో కూడా ఆయన పెళ్లిపై పలువురు ప్రశ్నించారు. అప్పుడు తనకు నచ్చిన అమ్మాయి దొరకగానే పెళ్లి చేసుకుంటానని రాహుల్ చెప్పారు. తాజాగా మరోసారి ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది.

బీహార్లోని పాట్నాలో విపక్షాల ఐక్యతా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ రాహుల్ గాంధీ పెళ్లిప్రస్తావన తెచ్చి నవ్వులు పూయించారు. ‘‘మా మాట విను.. పెళ్లి చేసుకో.. నువ్వు పెళ్లిచేసుకోకపోవడంతో మీ అమ్మ ఆందోళన చెందుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. త్వరగా చేసుకో’’ అని అన్నారు.

రాహుల్ కూడా లాలూ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘లాలూ చెప్పారు కాబట్టి పెళ్లి జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఈ విషయంపై ఆలోచిస్తున్నా’’ అని అన్నారు. కాగా ఈ విపక్షాల సమావేశంలో 15పార్టీల నేతలు హాజరయ్యారు. భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేయాలని విపక్షా నిర్ణయించాయి.



Updated : 24 Jun 2023 8:58 AM IST
Tags:    
Next Story
Share it
Top