ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబంలో నలుగురు మృతి
X
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మరణించిన వార్త మరువకముందే మరో కుటుంబం రోడ్డు ప్రమాదానికి బలైంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు చెట్టును ఢీకొట్టింది. వెంటనే కారులో మంటలు చెలరేగడంతో ఆరు నెలల కిందట పెళ్లైన జంటతో పాటు మరో ఇద్దరు సజీవదహనమయ్యారు. హర్దా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.నలుగురు ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కావడంతో తీవ్ర విషాధచాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలో 10 మంది మృతి
రెండు రోజులు కిందట కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరులోని టి.నరసిపుర్ ప్రాంతంలో ఇన్నోవా కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.