JAGATPUR AXIC BANK : పట్టపగలే భారీ దోపిడీ.. బ్యాంకుకు కన్నం !!
X
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌గఢ్‌లో మంగళవారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. నగరంలోని JAGATPUR AXIC BANKలోని రూ. 7 కోట్ల విలువైన నగదు, రూ.1.50 కోట్ల బంగారాన్ని దోచుకెళ్లారు దొంగలు. బ్యాంక్ సిబ్బందిని గదిలో వేసి బంధించి.. లాకర్లోని సొమ్ముతో పరారయ్యారు. అడ్డుకోబోయిన బ్యాంక్ మేనేజర్‌ను గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
రాయ్‌గఢ్ సీనియర్ ఎస్పీ సదానందకుమార్ వెల్లడించిన వివరాల మేరకు... రాయగఢ్ నగరం జగత్‌పూర్ ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంకులోకి ఏడుగురు దుండగులు మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆయుధాలతో ప్రవేశించారు. తొలుత బ్యాంకు ఉద్యోగులకు తుపాకులు చూపించి బెదిరిస్తూ వారిని ఒక గదిలో బంధించారు. బ్యాంకు మేనేజర్‌ను లాకర్ గది తాళాలు అడగగా అతను నిరాకరించాడు. ఈ క్రమంలో దుండగులు అతన్ని పదునైన ఆయుధంతో కాలిపై దాడి చేసి గాయపర్చారు. ఆ తర్వాత నగదు, బంగారు నగలు దోచుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. తీవ్రంగా గాయపడిన బ్యాంకు మేనేజర్‌ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం దుండగుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు వెంటనే నగరంలోని రహదారులన్నీ దిగ్బంధనం చేశారు. చెక్‌పోస్టుల సిబ్బందిని అప్రమత్తం చేశారు. పట్టపగలు జరిగిన ఈ దోపిడీతో నగరమంతా కలకలం రేగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్యాంక్ మేనేజర్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.