Home > జాతీయం > మానవ అక్రమ రవాణ.. 59 మంది చిన్నారుల్నికాపాడిన ఆర్పీఎఫ్..

మానవ అక్రమ రవాణ.. 59 మంది చిన్నారుల్నికాపాడిన ఆర్పీఎఫ్..

మానవ అక్రమ రవాణ.. 59 మంది చిన్నారుల్నికాపాడిన ఆర్పీఎఫ్..
X

మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను ఆర్పీఎఫ్ సిబ్బంది, మహారాష్ట్ర పోలీసులు కలిసి పట్టుకున్నారు. బీహార్ నుంచి రైలులో అక్రమంగా తరలిస్తున్న 59 మంది చిన్నారులను కాపాడారు. వీరికి ఓ ఎన్జీఓ సాయం చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బీహార్‌కు చెందిన 59 మంది చిన్నారులను దానాపూర్-పూణే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు స్థానిక పోలీసులు, ఒక ఎన్జీవో సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు బుధవారం ఉదయం దానాపూర్ - పూణే రైలు భుసావల్ స్టేషన్‌కు చేరిన వెంటనే అన్ని కంపార్ట్‌మెంట్‌లను తనిఖీ చేశారు. ఆ స్టేషన్‌లో 29 మంది పిల్లలను రక్షించారు. ఆ తర్వాత రైలు మన్మాడ్‌ స్టేషన్‌కు చేరుకోగానే మరో 30 మంది పిల్లలను గుర్తించి కాపాడారు.

ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించిన 59 మందిలో 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలున్నారు. వారిని బీహార్‌ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మానవ అక్రమ రవాణ కింద ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. ఎన్జీవో సిబ్బంది, పోలీసుల సహకారంతో పిల్లల అక్రమ రవాణాను అడ్డుకున్నామని ఆర్పీఎఫ్‌ ట్వీట్‌ చేసింది.






Updated : 31 May 2023 2:59 PM GMT
Tags:    
Next Story
Share it
Top